NEWSANDHRA PRADESH

3,396 మ‌ద్యం షాపులు రూ. 1797.64 కోట్లు

Share it with your family & friends

ఏపీ ప్ర‌భుత్వానికి భారీ ఆదాయం

అమ‌రావతి – ఏపీ ప్ర‌భుత్వానికి భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది. అక్టోబ‌ర్ 1న మ‌ద్యం షాపుల నిర్వహ‌ణ‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ‌గా మ‌ద్యం షాపుల‌కు అప్లికేష‌న్లు రావ‌డం విస్తు పోయేలా చేసింది.

రాష్ట్రంలో 3,396 ద‌ర‌ఖాస్తుల‌కు గాను రికార్డు స్థాయిలో ఏకంగా 89,882 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఏపీ స‌ర్కార్ కీల‌క నిబంధ‌న విధించింది. ప్ర‌తి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు తిరిగి చెల్లించ‌ని విధంగా రూ. 2 ల‌క్ష‌లు చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో కేవ‌లం ఫీజు రూపేణా రూ. 17 కోట్ల‌కు పైగా ఆదాయం స‌మ‌కూరింది.

అయితే దరఖాస్తుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది ప్ర‌భుత్వం. ప్రభుత్వ అంచనాల నుంచి దరఖాస్తు ఫీజు ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్ల‌యింది.

ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి దుకాణానికి స‌రాస‌రి 25 ద‌ర‌ఖాస్తులు రావ‌డం విశేషం.

వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి అక్టోబ‌ర్ 14న సోమ‌వారం డ్రా తీయ‌నుంది ఏపీ స‌ర్కార్. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీయనున్నారు అధికారులు. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి ఏపీలో అందుబాటులోకి ప్రైవేట్ మద్యం దుకాణాలు రానున్నాయి.