రేపటి నుంచి పల్లె పండుగ
అక్టోబర్ 14 నుంచి 20 వరకు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్టోబర్ 14 సోమవారం నుంచి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈనెల 20 వరకు పల్లె పండుగ జరగనుంది.
ఇదిలా ఉండగా గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో శ్రీకారం చుడతారు. 2024-25 ఏడాదికి గాను రూ.4,500 కోట్లతో గ్రామసభల పనులకు ఆమోదం పొందేలా చూస్తారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది సర్కార్.
ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఆచరణలో తీసుకు రావాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.