పల్లె పండుగను విజయవంతం చేయాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని చేపట్టింది. అక్టోబర్ 14 నుంచి 20 వరకు పల్లె పండుగ జరగనుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం రికార్డ్. ఇప్పటికే ప్రపంచ రికార్డ్ సృష్టించింది.
ఇదిలా ఉండగ గ్రామ సభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి. ఏపీలో వారం రోజుల పాటు జరిగే ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమం ద్వారా పనులు చేపట్టాలని సూచించారు సీఎం.
రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు ఈ పల్లె పండుగలో. 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని చేపట్టనున్నారు.
25,000 గోకులాలు.10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు. చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు.