అమ్మ వారి సన్నిధిలో స్మితా సబర్వాల్
విజయానికి ..సత్యానికి ప్రతీక దుర్గాదేవి
హైదరాబాద్ – సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ వైరల్ గా మారారు. ప్రతి ఏటా విజయ దశమి పండుగ సందర్బంగా కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవాళ తాను అమ్మ వారికి పూజలు చేశానని, అమ్మ వారిని తమ కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారంతా సుఖ సంతోషాలతో , సిరి సంపదలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలిపారు స్మితా సబర్వాల్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఇప్పటికే భారత దేశ రాజధాని న్యూఢిల్లీ లోని రాంలీలా మైదానంలో దుర్గాష్టమిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ పాల్గొన్నారు.