NEWSANDHRA PRADESH

అప్ర‌మత్తంగా ఉండండి – హోం మంత్రి

Share it with your family & friends

విశాఖ బీచ్ ను ప‌రిశీలించిన అనిత

విశాఖ‌ప‌ట్నం – తుఫాను హెచ్చ‌రిక నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు ఏపీ హోం, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. సోమవారం ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వీకెండ్, దసరా సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఆరా తీశారు. బీచ్ కి వచ్చే వారిలో అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచాల‌న్నారు. ప్ర‌ధానంగా పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్తకుండా చూడాల‌న్నారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ బంగాళా ఖాతంలో అల్ప పీడ‌నం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించ‌డంతో ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. తుపాను నేపథ్యంలో మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి.

బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాబోయే తుపాను నుంచి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది, ఆస్తి నష్టం కలగకుండా ఉండేలా నిరంతరం కీలక శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

తుపాను ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లకు సైతం తగు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు రాబోయే రెండు రోజులు తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకి వెళ్ల వ‌ద్ద‌ని కోరారు.