ఈ దేశం విడి పోవడం ఇష్టం లేదు
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కామెంట్
ఢిల్లీ – ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన ఖలిస్తాన్ ఉద్యమంపై స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. మీరు ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నించిన జర్నలిస్టులకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఖలిస్తాన్ ఉద్యమం పుట్టినప్పుడు నేను పుట్టక పోవచ్చు. కానీ ఆ వేర్పాటు వాద ఉద్యమాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చానని చెప్పారు లారెన్స్ బిష్ణోయ్.
భారత దేశం విడి పోవడం తమకు ఇష్టం లేదన్నారు. నేను చిన్నవాడిని కానీ నేను చదువుకున్నాను. నాకు ఈ దేశం పట్ల కాసింత గౌరవం ఉందన్నారు. దేశానికి ఏది మంచో ఏది చెడో అర్థమైందన్నారు.
కేరళను విడదీయాలని ఎవరైనా మీకు చెబితే, మీకు కేరళతో ఏమి సంబంధం, కానీ మీరు కూడా దేశం విడి పోకూడదని కోరుకుంటున్నారని అన్నారు లారెన్స్ బిష్ణోయ్.
ఇదిలా ఉండగా ఇప్పటికే లారెన్స్ పై ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. ప్రత్యేకించి కింగ్ సల్మాన్ ఖాన్ ను చంపుతానంటూ ప్రకటించాడు. తనకు జంతువులు అంటే వల్లమాలిన అభిమానం.