సల్మాన్ ఖాన్ భావోద్వేగం
బాబా సిద్దిఖ్ అంతియాత్రలో
ముంబై – ఎన్సీపీ లీడర్, మాజీ మంత్రి బాబా సిద్దిక్ ను దారుణంగా కాల్చి చంపడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆయనకు ఇటు మీడియాతో అటు వినోద పరిశ్రమతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. బాబా సిద్దికి అంతిమ యాత్రలో సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వైరల్ గా మారారు. ఆయనకు బాబా సిద్దిఖ్ తో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరించే వారని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన బాబాను దారుణంగా కాల్చి చంపడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇదిలా ఉండగా తన కార్యాలయం బయట ఉన్న బాబా సిద్దిఖిని తన తనయుడితో మాట్లాడుతుండగా ముగ్గురు అగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు యూపీకి చెందిన వారు కాగా మరొకరు హర్యానాకు చెందిన వారని వెల్లడించారు.