NEWSTELANGANA

పండుగ‌ల పేరుతో ఛార్జీలు పెంచితే ఎలా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల పేరుతో అడ్డ‌గోలుగా ఛార్జీలు పెంచడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమ‌ని ఆరోపించారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఎక్స్ లో షేర్ చేశారు.

హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ ప్రభుత్వం పెంచిన చార్జీ రూ.420 అని ఆరోపించారు.

బస్సుల సంఖ్య పెంచకుండా, టెకెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలన అని సీఎంను నిల‌దీశారు త‌న్నీరు హ‌రీశ్ రావు.