రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ – సీఎం
ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత దేశం గర్వించ దగిన మహోన్నత పారిశ్రామికవేత్త , టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా ఇటీవలే మృతి చెందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
రతన్ టాటా లోతైన వారసత్వాన్ని గుర్తుచే సుకోవడానికి గాను నివాళిగా అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం.
ఈ హబ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్ , మెంటర్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దీనిని ఐదు ఇతర జోనల్ కేంద్రాలకు అనుసంధానించడం జరుగుతుందని తెలిపారు సీఎం.
ప్రతి ఒక్కటి ప్రఖ్యాత వ్యాపార సమూహాలచే మార్గ దర్శకత్వం వహిస్తుందని, అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత, నైపుణ్యాల మెరుగుదలని సులభతరం చేస్తుందని స్పస్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.