స్కిల్ సెన్సెస్ అనేది గేమ్ ఛేంజర్
ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి వెల్లడి
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ సెన్సస్ అనేది ఒక గేం చేంజర్ అని అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు.
యువతకి, ఇటు పెట్టుబడిదారులకి ఏమి కావాలో తెలుసుకుని, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇది ప్రత్యేకంగా పని చేస్తుందని అన్నారు నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే తమ ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు .
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఈ స్కిల్ సెన్సెస్ ఎంతగానో ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు నారా లోకేష్. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నైపుణ్యాన్ని అభివృద్ది పర్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
స్కిల్ సెన్సెస్ ప్రధాన ఉద్దేశం స్కిల్ ను గుర్తించడం, మరింత మెరుగైన రీతిలో మెరుగులు దిద్దడం చేస్తుందని పేర్కొన్నారు నారా లోకేష్.