NEWSANDHRA PRADESH

మాడ‌భూషి..పాశంపై దాడి త‌గ‌దు

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా హైద‌రాబాద్ లో అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇదే స‌మ‌యంలో అన్ని పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో పాటు క‌వులు, క‌ళాకారులు, మేధావులు, ర‌చ‌యిత‌లు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ప్ర‌త్యేకంగా పేరు పేరునా ఫోన్ చేసి పిలిచారు గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌.

ఇదిలా ఉండ‌గా ప్రొఫెస‌ర్ మాడభూషి శ్రీ‌ధ‌ర్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరిని సైతం బండారు ద‌త్తాత్రేయ ఆహ్వానించార‌ని తెలిపారు హ‌రీశ్ రావు. ఈ స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అడ్డుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా తెలంగాణ వారిని కావాల‌ని అవ‌మానించ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు.

సీఎం సెక్యూరిటీ దాడి చేయ‌డం దారుణ‌మ‌ని ఆరోపించారు త‌న్నీరు హ‌రీశ్ రావు. పోలీసుల అమానుష ప్ర‌వ‌ర్త‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.