విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దం
ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – రాష్ట్ర వాతావరణ కేంద్రం భారీ వర్షాలు రానున్నాయని హెచ్చరించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు అంతటా అప్రమత్తం చేశామని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారని, సహాయక చర్యలు చేపట్టడంలో దృష్టి సారించారని అన్నారు.
ఇదిలా ఉండగా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.
భారీ వర్ష సూచన నేపధ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు.. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే సిల్టు తీయాలని, బాటిల్ నెక్స్ క్లీన్ చేయమని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు పొంగూరు నారాయణ.
వాటర్ ట్యాంకులు, జనరేటర్లు, ఎక్సకవేటర్లు, ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆహారం, తాగునీరు వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు . కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి విజయవాడ నుంచి ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు.