NEWSNATIONAL

కెనడా నుంచి భార‌త్ హై క‌మిష‌న‌ర్ వెన‌క్కి

Share it with your family & friends

ఆదేశించిన మోడీ కేంద్ర ప్ర‌భుత్వం

ఢిల్లీ – బీజేపీ మోడీ కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించింది కేంద్రం. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదని, అందుకే ఇండియాకు రావాల్సిందిగా ఆదేశించామ‌న్నారు.

హైకమిషనర్‌తో పాటు ఇండియాకు తిరిగి వస్తున్న మిగిలిన సిబ్బంది కూడా తిరిగి వ‌స్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ ఆరోపించింది కెన‌డా స‌ర్కార్. దీంతో కేంద్ర స‌ర్కార్ సీరియ‌స్ అయ్యింది. భార‌త్, కెన‌డా దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. కాగా ఆసియా స‌ద‌స్సు సంద‌ర్బంగా పీఎం మోడీ ఇటీవ‌లే కెనడా పీఎం ట్రూడోతా భేటీ అయ్యారు. దీనిపై చ‌ర్చించారు కూడా.

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో ఒట్టావాతో పాటు మ‌రికొంద‌రు భార‌తీయ దౌత్య వేత్త‌ల‌కు సంబంధం ఉందంటూ కెన‌డా స‌ర్కార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ త‌రుణంలో హై క‌మిష‌న‌ర్ కు, సిబ్బందికి అక్క‌డ భ‌ద్ర‌త లేదంటూ స్ప‌ష్టం చేసింది మోడీ స‌ర్కార్.

ఖ‌లిస్తాన్ ఉగ్ర‌వాదులు భార‌తీయుల‌ను టార్గెట్ చేశార‌ని పేర్కొన్నారు. కెనడా హై క‌మిష‌న‌ర్ సంజయ్ కుమార్ వ‌ర్మ‌పై చేసిన కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని తీవ్ర స్థాయిలో మండి ప‌డింది.