మునావర్ ఫారూఖీకి భద్రత పెంపు
లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు
ముంబై – ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీకి ముంబై పోలీసులు భద్రతను పెంచారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణ హాని ఉందని తెలియడంతో సెక్యూరిటినీ పెంచినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో మునావర్‌పై దాడికి ప్లాన్ చేసినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు నిర్దిష్ట సమాచారం అందింది, విషయం స్టాండప్ కమెడియన్ కు సమాచారం అందించడంతో హుటా హుటిన ముంబైకి తిరిగి వెళ్లాడు.
ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసులను అలర్ట్ చేయడంతో వెంటనే మునావర్ ఫారూఖీకి ఈ విషయం చేరవేశారు. ఆయనకు సెక్యూరిటీ పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పటికే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు ముప్పు పొంచి ఉందని , భారీ ఎత్తున సెక్యూరిటీ పెంచారు.
ఏదో ఒక రోజు సల్మాన్ ఖాన్ ను చంపి తీరుతానంటూ బహిరంగంగానే లారెన్స్ ప్రకటించడం విశేషం. మరో వైపు బెదిరింపుల జాబితాలో సల్మాన్ తో పాటు మునావర్ ఫారూఖీ కూడా చేరడం విశేషం. ఈ మధ్యనే ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమంపై సీరియస్ కామెంట్స్ చేశాడు గ్యాంగ్ స్టర్ . తాను భారత దేశం విడి పోవడాన్ని సహించ లేనంటూ ప్రకటించాడు.