NEWSANDHRA PRADESH

ఏపీకి నితిన్ గ‌డ్క‌రీ ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

ర‌హ‌దారుల అభివృద్దికి నిధులు

ఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ మోడీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ కు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. మంగ‌ళ‌వారం కేంద్ర మంత్రి ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఏపీ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ర‌హ‌దారుల అభివృద్దికి సంబంధించి నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా ఏపీ స‌ర్కార్ ధ‌న్య‌వాదాలు తెలిపింది నితిన్ గ‌డ్క‌రీకి.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్ఐఎఫ్ ( CRIF ) పథకం కింద మొత్తం 200.06 కిలోమీట‌ర్ల మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించారు కేంద్ర మంత్రి.

అంతే కాకుండా అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ కేంద్ర ప‌థ‌కం కింద‌ సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో నాలుగు-లేన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి కూడా రూ. 98 కోట్లను ఆమోదించడం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు నితిన్ గ‌డ్క‌రీ.