ఉన్నతమైన కలలు సక్సెస్ కు సోపానాలు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనుభవాలు
హైదరాబాద్ – భారత దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత దేశ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చివరి శ్వాస వరకు అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి. కలలు కనండి వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయండి అన్న కలాం పిలుపు కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఆయన తన జీవితంలో కష్టాలను అధిగమించి ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలో ఆచరణలో చూపించిన సైంటిస్ట్.
అక్టోబర్ 15న కలాం పుట్టిన రోజు. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్బంగా ఆయన వ్యక్తం చేసిన ఆలోచనలు, అభిప్రాయాలను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కల అంటే మీరు నిద్రపోతున్నప్పుడు చూసేది కాదు, అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు.
మీ కలలు నిజం కావడానికి ముందు మీరు కలలు కనాలి.
మీరు సూర్యునిలా ప్రకాశించాలని అనుకుంటే, మొదట సూర్యునిలా మండి పోవాలి.
విజయం సాధించాలనే సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం ఎప్పటికీ అధిగమించదు.
మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే మీరు రెండవ విజయంలో విఫలమైతే, ఆ విజయం కేవలం అదృష్టమే అని చెప్పడానికి ఎక్కువ మంది ఆరాట పడతారు.
మనందరికీ సమాన ప్రతిభ లేదు. కానీ, మన ప్రతిభను పెంపొందించు కోవడానికి మనందరికీ సమాన అవకాశం ఉంది.
దేశంలోని అత్యుత్తమ మెదడులను తరగతి గదిలోని చివరి బెంచీలలో చూడవచ్చు.
నేను అందమైన కుర్రాడిని కాదు, కానీ సహాయం అవసరమైన వారికి నేను చేయి ఇవ్వగలను. అందం హృదయంలో ఉంది, ముఖంలో కాదు.
ఆకాశం వైపు చూడు. మనం ఒంటరిగా లేము. విశ్వమంతా మనతో స్నేహ పూర్వకంగా ఉంటుంది . కలలు కనే వారికి, పని చేసేవారికి ఉత్తమమైన వాటిని అందించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని మరిచి పోవద్దు.
ఒకరిని ఓడించడం చాలా సులభం, కానీ ఒకరిని గెలవడం చాలా కష్టం.
మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఆలోచనే మీ మూలధన ఆస్తిగా మారాలి.
మనిషికి జీవితంలో కష్టాలు అవసరం . ఎందుకంటే అవి విజయాన్ని ఆస్వాదించడానికి చాలా ఉపయోగ పడతాయి.
మీ మిషన్‌లో విజయం సాధించాలంటే, మీ లక్ష్యం పట్ల మీరు ఏక మనస్సుతో కూడిన భక్తిని కలిగి ఉండాలి.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా లేదా మీ కెరీర్‌లో అగ్రస్థానానికి వెళ్లాలన్నా, పైకి ఎక్కడానికి బలం అవసరం అన్నది గుర్తించాలి.
మనం దేనినీ వదులు కోకూడదు, సమస్య మనల్ని ఓడించడానికి అనుమతించ కూడదు.
మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ రోజును త్యాగం చేసేందుకు సిద్దమై ఉండాలి.
గొప్ప కలలు కనేవారి గొప్ప కలలు ఎల్లప్పుడూ అధిగమించబడతాయి.
ఎక్సలెన్స్ అనేది నిరంతర ప్రక్రియ..అది ప్రమాదం కాదు.
ఒక మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులకు సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం.
చిన్న లక్ష్యం నేరం.గొప్ప లక్ష్యం కలిగి ఉండండి.
మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చు కోవచ్చు, మీ అలవాట్లు మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి అనే నమ్మకంతో ఉండండి.
కలలు, కలలు, కలలు. కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి . ఆ ఆలోచనలు చర్యకు దారి తీస్తాయనే నమ్మకంతో ఉండండి. అడుగులు వేయండి.
ఆలోచించడం పురోగతి. ఆలోచించక పోవడం అనేది వ్యక్తి, సంస్థ , దేశాన్ని నిర్వీర్యం చేస్తుంది.
మహా పురుషులకు, మతం స్నేహితులను సంపాదించడానికి ఒక మార్గం; చిన్న వ్యక్తులు మతాన్ని పోరాట సాధనంగా చేస్తారు.. జర జాగ్రత్త.
మీరు విఫలమైతే, ఎప్పుడూ వదులు కోవద్దు ఎందుకంటే అపజయం అంటే నేర్చుకునే మొదటి ప్రయత్నం అని గుర్తు పెట్టుకోండి.
అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది. సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం మిమ్మల్ని గొప్పగా చేస్తుంది.
మీ ఉద్యోగాన్ని ప్రేమించండి, కానీ మీ కంపెనీని ప్రేమించకండి, ఎందుకంటే మీ కంపెనీ మిమ్మల్ని ప్రేమించడం ఎప్పుడు ఆపుతుందో మీకు తెలియక పోవచ్చు.
కష్టపడి పనిచేసే వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. దీనిని గుర్తించి అడుగులు వేయండి జాగ్రత్తగా.
నేను సన్యాసిని కాదు, కానీ నేను మంచి మనిషిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను.
ప్రత్యేకంగా మారడానికి, మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఎవరైనా ఊహించ గలిగే కష్టతరమైన యుద్ధంలో పోరాడడమే సవాలు .
వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి విశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం.
నా సందేశం, ముఖ్యంగా యువకులకు, విభిన్నంగా ఆలోచించే ధైర్యం, కని పెట్టడానికి ధైర్యం, అన్వేషించని మార్గంలో ప్రయాణించడం, అసాధ్యమైన వాటిని కనుగొనే ధైర్యం, సమస్యలను జయించి విజయం సాధించడం.
“ఒక మూర్ఖుడు అతను మూర్ఖుడని అర్థం చేసుకున్నప్పుడు మేధావి అవుతాడు. కానీ అతను మేధావి అని అర్థం చేసుకున్నప్పుడు మేధావి మూర్ఖుడు అవుతాడు.
నలుపు రంగు మానసికంగా చెడ్డది అని అందరూ భావిస్తారు, కానీ ప్రతి బ్లాక్ బోర్డు విద్యార్థి జీవితాన్ని ప్రకాశ వంతం చేస్తుందని గుర్తించాలి.
నీ రెక్కల రోజులు వృధాగా గడిచి పోనీయకు. ఒకసారి పోయినప్పుడు, ఏ బంగారం వాటిని తిరిగి కొనదు.
ప్రపంచంలో అత్యుత్తమ గురువు ఎవరంటే కాలం. దానిని జాగ్రత్తగా వాడుకోవాలి.