NEWSTELANGANA

అబ్దుల్ క‌లాం మ‌హోన్న‌త మాన‌వుడు

Share it with your family & friends

కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి , దివంగ‌త డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాంకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ దేశం మ‌రిచి పోని అరుదైన మ‌హోన్న‌త మాన‌వుడు అని కితాబు ఇచ్చారు.

అక్టోబ‌ర్ 15న క‌లాం జ‌యంతి సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా మంగ‌ళ‌వారం స్పందించారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. మిస్సైల్ మ్యాన్ గా ఎల్ల‌ప్ప‌టికీ ఈ దేశం గుర్తు పెట్టుకుంటుంద‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.

క‌లాం వినయం, దృష్టి, జ్ఞానం , విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింద‌ని పేర్కొన్నారు. కలాం వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశం రూపొందించ‌డంలో, క‌ల‌ల్ని సాధించడంలో కలాం దార్శనికత , ఆలోచనలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ్డాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు . అంతే కాదు భారతదేశాన్ని పటిష్టంగా, సుసంపన్నంగా, సమర్ధవంతంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.