చిరస్మరణీయం కలాం జీవితం – రాకేశ్ రెడ్డి
మిస్సైల్ మ్యాన్ ను మరిచి పోలేం
హైదరాబాద్ – డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి . అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా మంగళవారం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. కలాం లాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. తన లాంటి వారికే కాదు కోట్లాది ప్రజలను ఆయన ప్రభావితం చేశారని కొనియాడారు.
కలాం జీవితమే ఓ సందేశమని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే బలమైన కలలు కనాలని, ఆ దిశగా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాదు జాతి గర్వించేలా మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందారని అన్నారు .
ఇలాంటి మహానుభావులు ఎప్పుడో ఒకసారి పుడుతుంటారని, ఆయన సాధించిన విజయాలు, ఆచరించిన జీవితం ఎల్లప్పటికీ స్పూర్తి దాయకంగా నిలుస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
కలాం కు సంబంధించిన సరళత, సమగ్రత, దార్శనికత, మేధస్సు, ఆయన వారసత్వం భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేలా యువతీ యువకులకు స్పూర్తిని కలిగిస్తూనే ఉంటుందన్నారు.
‘కలలు, కలలు, కలలు కనండి. కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి, ఆలోచనలు చర్యకు దారి తీస్తాయంటూ ఆచరణాత్మకంగా నిరూపించిన కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.