NEWSTELANGANA

మిస్సైల్ మ్యాన్ కు కేసీఆర్ నివాళి

Share it with your family & friends

జాతి గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు

హైద‌రాబాద్ – డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆద‌ర్శ ప్రాయమ‌ని పేర్కొన్నారు తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ . అక్టోబ‌ర్ 15న క‌లాం జ‌యంతి సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా నివాళులు అర్పించారు. జాతి గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అని కొనియాడారు .

నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్ర‌వేత్త క‌లాం అని ప్ర‌శంసించారు. దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు కేసీఆర్.

ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు ఈ సంద‌ర్బంగా. మిస్సైల్ మ్యాన్ గా ఎల్ల‌ప్ప‌టికీ ఈ దేశం గుర్తు పెట్టుకుంటుంద‌ని అన్నారు. క‌లాం వినయం, దృష్టి, జ్ఞానం , విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింద‌ని పేర్కొన్నారు. కలాం వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశం రూపొందించ‌డంలో, క‌ల‌ల్ని సాధించడంలో కలాం దార్శనికత , ఆలోచనలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ్డాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు . అంతే కాదు భారతదేశాన్ని పటిష్టంగా, సుసంపన్నంగా, సమర్ధవంతంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.