మహోన్నత మానవుడు కలాం – లోకేష్
ఆయన జీవితం చిరస్మరణీయం
అమరావతి – మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఎక్స్ వేదికగా స్పందించారు. . దేశం కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం జీవితాంతం శ్రమించిన మహనీయుడు కలాం అని కొనియాడారు.
విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎనలేని సేవలందించిన కలాం చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు . జాతి గర్వించ దగిన మానవుడు అని కొనియాడారు .
నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రవేత్త కలాం అని ప్రశంసించారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు లోకేష్.
ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్బంగా. మిస్సైల్ మ్యాన్ గా ఎల్లప్పటికీ ఈ దేశం గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. కలాం వినయం, దృష్టి, జ్ఞానం , విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు. కలాం వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.