NEWSTELANGANA

గురుకులాల‌కు తాళం మంత్రి ఆగ్ర‌హం

Share it with your family & friends

క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్

హైద‌రాబాద్ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సీరియ‌స్ అయ్యారు. మంగ‌ళ‌వారం భూపాల‌ప‌ల్లి జిల్లాలో మైనార్టీ గురుకులానికి సంబంధించి గ‌త 10 నెల‌లుగా అద్దె చెల్లించ‌క పోవ‌డంతో య‌జమాని తాళం వేశారు. మ‌రికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లే ఎదురు కావడంతో మంత్రి స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గురుకుల పాఠ‌శాల‌కు తాళం వేసిన వారిపై వెంట‌నే క్రిమినల్ కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల‌లో ఎక్కువ‌గా 70 శాతానికి పైగా అద్దె భ‌వ‌నాల‌లో కొన‌సాగుతున్నాయ‌ని, దీనికి ప్ర‌ధాన కార‌ణం గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆరోపించారు మంత్రి.

ఈ బ‌కాయిలు గ‌త కొంత కాలం నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్నాయ‌ని గ‌మ‌నించాల‌ని సూచించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఇటీవ‌లే సీఎం, డిప్యూటీ సీఎం తో స‌మావేశం నిర్వ‌హించామ‌ని, నిధుల విడుద‌ల చేయాల‌ని ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు.

తాళాలు వేయ‌డం మంచిది కాద‌ని, త్వ‌ర‌లోనే నిధులు విడుద‌ల చేస్తామ‌ని కాద‌ని కూడ‌ద‌ని అనుకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ వార్నింగ్ హెచ్చ‌రించారు.