NEWSNATIONAL

ఎన్నిక‌ల్లో ఉచితాల‌పై సుప్రీం నోటీసు

Share it with your family & friends

ఎన్నిక‌ల సంఘానికి కోర్టు బిగ్ షాక్

ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా భార‌త దేశంలో ఆయా పార్టీలు మేనిఫెస్టోల పేరుతో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసేలా ఉచిత హామీలు ఇవ్వ‌డం ప‌రిపాటిగా మారి పోయింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

ఉచితాల పేరుతో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని, ఇది భార‌త దేశ రాజ్యాంగానికి, ప్ర‌జాస్వామ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ద‌మ‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మంగ‌ళవారం ఈ దావాపై విచార‌ణ చేప‌ట్టింది సుప్రీంకోర్టు.

ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

ఎన్నికల ఉచితాలకు వ్యతిరేకంగా కొత్త అభ్యర్ధనపై స్పందించాలని కేంద్రం, ఎన్నికల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. తనిఖీ చేయని ఉచితాలు పన్ను చెల్లింపుదారులపై భారం పడతాయని , ఎన్నికలకు ముందు ఓటర్లను అన్యాయంగా మారుస్తాయని పిటిషనర్ దావాలో పేర్కొన్నారు.

ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై వాదోప‌వాద‌న‌లు విన్న అనంత‌రం సుప్రీంకోర్టు ఇటు కేంద్రానికి అటు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి మెట్టికాయ‌లు వేసింది.