లారెన్స్ బిష్ణోయ్ కస్టడీ బదిలీకి బ్రేక్
ఆదేశించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీ – కేంద్ర మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు కేసులలో నిందితుడిగా ఉన్న ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ గా పేరు పొందిన లారెన్స్ బిష్ణోయ్ కు సంబంధించి కస్టడీ బదిలీ చేయొద్దంటూ ఆదేశించింది. ఈ విషయం విశ్వసనీయ సమాచారం ఆధారంగా తెలిసింది.
ప్రస్తుతం గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తాజాగా ముంబైలో ఎన్సీపీ లీడర్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీని కాల్చి చంపారు. ఇందులో ముగ్గురు పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
ఇక పట్టుబడిన వారిలో ఒకరు యూపీకి చెందిన వారు కాగా మరొకరు హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదే సమయంలో బాబా సిద్దిఖీ దారుణ కాల్పుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని అనుమానిస్తున్నారు.
ఇందుకు సంబంధించి విచారణ జరిపేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు ముంబై పోలీసులు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోం శాఖ. ఒకవేళ విచారణ జరపాలని అనుకుంటే గుజరాత్ లోనే విచారణ చేసుకోవచ్చంటూ పేర్కొంది.
మరో వైపు కెనడా సంచలన ఆరోపణలు చేసింది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై. ఖలిస్తానీ వాదుల హత్య వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ విమర్శించింది.