మరాఠా..జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారి
ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మంగళవారం సీఈసీ రాజీవ్ కుమార్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా తమకు ఛాలెంజ్ గా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సజావుగా ముగిశాయని, దీనికి సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఇక హర్యానాలో ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసేందుకు తరలి వచ్చారని అన్నారు.
ఈ రెండు రాష్ట్రాలలో ప్రజలు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడ లేదని పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో 36 జిల్లాలు , 288 శాసన సభ స్థానాలు ఉండగా వచ్చే నవంబర్ 26న తుది గడువు ఉందన్నారు. ఒక్క మరాఠాలోనే ఏకంగా 9.63 ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.
ఇక జార్ఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం 81 స్థానాలు ఉన్నాయని, వచ్చే జనవరి 5తో శాసన సభ గడువు పూర్తవుతుందన్నారు. ఈ రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు రాజీవ్ కుమార్.
మరో వైపు సుప్రీంకోర్టు నోటీసు ఇవ్వడంపై సీఈసీ స్పందించ లేదు. ఎన్నికల సందర్బంగా ఉచితాలు ఇవ్వడం పై ఈ నోటీసు జారీ చేసింది.