జై శంకర్ కు పాకిస్తాన్ పీఎం విందు
ఇరువురి మధ్య తొలిసారి చర్చలు
పాకిస్తాన్ – భారత దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలనంగా మారారు. ఆయన ప్రస్తుతం కీలక సమావేశంలో పాల్గొనేందుకు గాను పొరుగు దేశమైన పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి పనిగట్టుకుని రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు.
కానీ భద్రతా కారణాల దృష్ట్యా పీఎం పాకిస్తాన్ కు వెళ్లలేదు. కానీ భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా శత్రు దేశంలో కాలు మోపారు. ఆయనకు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా జై శంకర్ తో భేటీ అయ్యారు.
ఆయనతో కరచాలనం చేస్తూ..ప్రత్యేకించి విందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. పీఎం పిలుపును మన్నించి పెద్ద మనసుతో జై శంకర్ ఈ విందుకు హాజరు కావడం ప్రపంచ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసింది.
ఈ సందర్బంగా జై శంకర్ పాక్ పీఎం వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ఏం మాట్లాడారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.