సీనియర్ ఐఏఎస్ లు ఏపీకి వెళ్లాల్సిందే
తెలంగాణ కావాలంటే కుదరదన్న క్యాట్
హైదరాబాద్ – ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లపై సీరియస్ కామెంట్స్ చేసింది క్యాట్. ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాంతంలోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారంటూ ప్రశ్నించింది. ఏపీకి ఎందుకు వెళ్లాలని అనుకోవడం లేదంటూ మండిపడింది.
డీఓపీటీ ఇప్పటికే తెలంగాణలో ఉండ కూడదంటూ , వెంటనే ఏపీకి వెళ్లి పోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ట్రిబ్యునల్ కు వెళ్లారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు రోనాల్డ్ రోస్ , వాణీ ప్రసాద్, ఆమ్రపాళి కాట్రా, వాకాటి కరుణ , ప్రశాంత్.
సెంట్రల్ సర్వీస్ లో ఉన్న మీరు ఒకే చోట ఉంటామని చెబితే కుదరదని చెప్పడం సరి కాదని పేర్కొంది క్యాట్. ప్రత్యేకించి తెలంగాణ అంటే ఎందుకు అంత ప్రేమ ఉందో చెప్పాలని ప్రశ్నించింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీసింది.
ఓ వైపు ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు, వరదలతో నానా తంటాలు పడుతుంటే ఇక్కడ ఉండి ఏం చేయాలని అనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసే ప్రసక్తి లేదని , వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది క్యాట్. ఇది పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది.