కర్నూల్ ఎంపీగా మేయర్
ఖరారు చేసిన సీఎం జగన్
అమరావతి – వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి మామూలోడు కాదు. తన లెక్కలేవో తనకు ఉన్నాయి. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో టికెట్లను ఖరారు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు జాబితాలను వెల్లడించారు. కొన్నింటిని మార్పు చేశారు. చాలా చోట్ల సిట్టింగ్ లను మార్చారు. మరికొందరికి అప్పగించారు. కొత్త వారికి కొన్ని సీట్లలో కేటాయింపులు జరిపారు.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి. గుమ్మనూరు జయరాంకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం మేయర్ గా ఉన్న బీవై రామయ్యను ఖరారు చేశారు. ఇది ఎవరూ ఊహించ లేదు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని ఎమ్మిగనూరు సీటును కూడా మార్చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్న కేశవ రెడ్డిని పక్కన పెట్టారు. ఆయన స్థానంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే ఇంకా స్పందించ లేదు.
ఇదిలా ఉండగా ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు గుమ్మనూరు జయరాం. అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో రామయ్యను ఖరారు చేసింది పార్టీ.