ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం – ఈసీ
పార్టీల ఆరోపణలు పూర్తిగా అబద్దం
ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈవీఎంల వ్యవస్థ వచ్చాక తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటోంది ఈసీ. దీనిపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు విచారణ చేపట్టాలని కోరుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది కూడా.
దీనిపై తీవ్రంగా స్పందించారు కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్. ఇదే సమయంలో ఆయన ఎగ్జిట్ పోల్స్ పై కూడా స్పందించారు. అదంతా బక్వాస్ అని కొట్టి పారేశారు. అయితే ఆయా సంస్థలకు స్వీయ నియంత్రణ అన్నది ఉండాలని స్పష్టం చేశారు. లేక పోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తమపై నిందలు వేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది పూర్తిగా అబద్దం అంటూ కొట్టి పారేశారు. ఆరు నెలల ముందు వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే తాము ఈవీఎంలను ఓపెన్ చేస్తామని తెలిపారు ఈసీ రాజీవ్ కుమార్. పోలింగ్ కు 5 రోజుల ముందు బ్యాటరీలు అమర్చడం జరుగుతుందని తెలిపారు.