ఐదేళ్లలో 20 లక్షల జాబ్స్ కల్పించాలి – లోకేష్
స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్ష
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి జాబ్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో తన ఛాంబర్ లో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐటిఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలని, ఐదేళ్లలో 2 0లక్షల ఉద్యోగాలు కల్పించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉన్నతాధికారులు పని చేయాలని సూచించారు నారా లోకేష్.
మంగళగిరి నియోజకవర్గంలో స్కిల్ సెన్సస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పని తీరు అడిగి తెలుసుకున్నరు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
విశాఖపట్నంలో 7 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి నారా లోకేష్.