ENTERTAINMENT

ఐసీసీసీసీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ర‌ష్మిక

Share it with your family & friends

నియ‌మించిన కేంద్ర ప్ర‌భుత్వం

ఢిల్లీ – ఇండియ‌న్ క్ర‌ష్ గా పేరు పొందిన ప్ర‌ముఖ బ‌హు భాషా న‌టి ర‌ష్మిక మంద‌న్నాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కో ఆర్డినేష‌న్ సెంట‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ర‌ష్మిక మంద‌న్నాను జాతీయ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా దేశంలోని సైబ‌ర్ క్రైమ్ ల‌ను ఎదుర్కొనేందుకు భార‌త హోం మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. ర‌ష్మిక మంద‌న్నా త‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కాగా ర‌ష్మిక మంధ‌న్నా పుష్ప ది రైజ్ , డియ‌ర్ కామ్రేడ్ , గీత గోవిందంతో పాటు హిందీలో న‌టించిన యానిమ‌ల్ మూవీలో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. యువ‌త‌లో ఆమెకు మంచి క్రేజ్ కూడా ఉంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ర‌ష్మిక‌కు సంబంధించి డీప్ ఫేక్ వీడియో సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌సారం అయ్యింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది ర‌ష్మిక‌.

సైబర్ క్రైమ్ ప్రభావాన్ని ఎదుర్కొన్న వ్యక్తిగా, ఆన్‌లైన్ ప్రపంచాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు న‌టి.
మనకు, భవిష్యత్ తరాలకు సురక్షితమైన సైబర్ స్పేస్‌ను నిర్మించేందుకు మనం ఏకం అవుదాం. I4C బ్రాండ్ అంబాసిడర్‌గా తాను బాధ్యతలు చేపట్టినందున వీలైనంత ఎక్కువ మందిని సైబర్ క్రైమ్‌ల నుండి రక్షించాలని కోరుకుంటున్నాను. త‌న‌తో పాటు మీరంతా భార‌త ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొంది మంద‌న్నా.

ఇన్‌స్టాగ్రామ్‌లో 44.2 మిలియన్ల ఫాలోవర్లు , Xలో 4.9 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు ర‌ష్మిక‌. 1930 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా సైబర్‌క్రైమ్.గవర్.ఇన్‌ని సందర్శించడం ద్వారా సైబర్‌క్రైమ్‌లను నివేదించాలని ప్రజలను కోరారు.