సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
హాజరైన రాహుల్ ..ప్రియాంక గాంధీ
జమ్మూ కాశ్మీర్ – జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీకి చెందిన సురీందర్ చౌదరి బాధ్యతు చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాలేదు. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది. జమ్మూ కాశ్మీర్ సర్కార్ లో తాము భాగం కాదల్చు కోలేదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా అన్ని పార్టీలు కలిసే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విస్తృతంగా పర్యటించారు , ప్రచారం చేశారు రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ. కానీ ఇవాళ జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరూ లేక పోవడం విస్మయానికి గురి చేసింది.
కాగా ఈ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఎందుకు సర్కార్ లో భాగస్వామ్యం పంచు కోలేదనే దానిపై చెప్పేందుకు నిరాకరించారు రాహుల్ గాంధీ.