ENTERTAINMENT

లారెన్స్ బిష్ణోయ్ లుక్ సూప‌ర్ – ఆర్జీవీ

Share it with your family & friends

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు

హైద‌రాబాద్ – వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎక్స్ లో ట్రెండింగ్ గా మారాయి.

దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు లారెన్స్ బిష్ణోయ్. ఇప్ప‌టికే త‌ను ప‌లుమార్లు న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశాడు. త‌ను జంతు ప్రేమికుడు. ఏదో ఒక రోజు స‌ల్మాన్ ను చంపి తీరుతానంటూ ప్ర‌క‌టించాడు. దీంతో స‌ల్మాన్ ఖాన్ కు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

ఈ త‌రుణంలో స‌ల్మాన్ కు స‌పోర్ట్ గా ఉన్న ఎన్సీపీ లీడ‌ర్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దారుణంగా కాల్చి చంపారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. అయితే ఈ ఘ‌ట‌న వెనుక లారెన్స్ గ్యాంగ్ ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ స‌మ‌యంలో రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన కామెంట్స్ పుండు మీద కారం చ‌ల్లినట్ల‌యింది. లారెన్స్ బిష్ణోయ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అత‌డి క‌ళ్ల‌ల్లో ఏదో మ్యాజిక్ ఉంద‌న్నాడు. అత‌డి కంటే అందంగా న‌టులు ఎవ‌రూ ఇంత వ‌ర‌కు త‌న‌కు క‌నిపించ లేదంటూ కితాబు ఇచ్చాడు. అయితే బిష్ణోయ్ బ‌యో పిక్ తీస్తారేమోన‌ని అంద‌రు అనుకుంటున్నారు.

ఒక చిత్రం బిగ్గెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఆధారంగా రూపొందితే, ఏ చిత్ర నిర్మాత కూడా నటించడు. దావూద్ ఇబ్రహీం లేదా చోటా రాజన్ లాగా కనిపించే వ్యక్తి .. కానీ ఇక్కడ, బి కంటే అందంగా కనిపించే ఒక్క సినిమా స్టార్ కూడా నాకు తెలియదంటూ పేర్కొన్నాడు ఆర్జీవీ.