NEWSNATIONAL

ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే వాణిజ్యం జ‌ర‌గ‌దు

Share it with your family & friends

పాకిస్తాన్ కు తేల్చి చెప్పిన ఎస్ జై శంక‌ర్

పాకిస్తాన్ – భార‌త దేశ విదేశాంగ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదిక‌గా బుధ‌వారం ఎస్సీఓ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల్సి ఉండ‌గా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల్గొన‌లేదు. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మోడీ రాక పోవ‌డం వెలితిగా ఉంద‌న్నారు.

పాకిస్తాన్ ప్ర‌భుత్వం భార‌త ప్ర‌భుత్వంతో, ప్ర‌ధానంగా మోడీతో అనుసంధానం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఎస్సీఓలో సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ పాల్గొని ప్రసంగించారు. శ‌క్తివంత‌మైన సందేశం ఇచ్చారు పాకిస్తాన్ కు.

విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ గ‌డ్డ‌పై ఆ దేశాన్ని ఏకి పారేశారు. ఆ దేశం చేస్తున్న త‌ప్పుల‌ను ప్ర‌ధానంగా ఎత్తి చూపారు. సరిహద్దుల్లో కార్యకలాపాలు తీవ్రవాదం, వేర్పాటు వాదంతో గుర్తించ బడితే, వాణిజ్యం, శక్తి లేదా కనెక్టివిటీ వృద్ధి చెందుతుందని తాము ఎలా ఆశించగలమ‌ని నిల‌దీశారు ఎస్ జై శంక‌ర్.

ఇదిలా ఉండ‌గా 9 ఏళ్ల తర్వాత జైశంకర్ పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వరకు వాణిజ్యం జరగదని ఆయన నొక్కి చెప్పారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ భారత్ సార్వ భౌమత్వాన్ని దెబ్బ తీస్తోందని జైశంకర్ అన్నారు.