జార్ఖండ్ లో మాదే అధికారం – చంపా సోరేన్
బీజేపీతో కీలక భేటీ తర్వాత కామెంట్స్
జార్ఖండ్ – జార్ఖండ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరేన్. ఆయన ఎవరూ ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీతో జత కట్టారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది.
దీంతో ఇరు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి మొదలైంది. బుధవారం ఈ మేరకు చంపా సోరేన్ బీజేపీ అగ్ర నాయకత్వంతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాంచీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఏమేరకు ఒప్పందం కుదిరిందనే దానిపై తాను ఇప్పుడే ఏమీ చెప్ప బోవడం లేదన్నారు చంపా సోరేన్.
కీలక చర్చల మేరకు త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు . తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పట్లో చెప్పలేనని అన్నారు చంపా సోరేన్. అప్పటి పరిస్థితుల మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అయితే బీజేపీ బాగా పని చేస్తోందని, ప్రజలు ఆదరిస్తున్నారని, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ప్రకటించారు చంపా సోరేన్.