సిద్దు..అనుపమ హల్ చల్
టిల్లు 2 టీజర్ వైరల్
హైదరాబాద్ – డీజే టిల్లు తో ఉన్నట్టుండి సెన్సేషన్ అయ్యారు నటుడు జొన్నలగడ్డ సిద్దు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది టిల్లు 2 చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది.
డోనరుడా చిత్రం సక్సెస్ తో వెలుగులోకి వచ్చిన మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తోంది ఈ మూవీ. ఇక అందాల ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించింది. ఇక ఇందులో మోతాదుకు మించి రొమాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక టిల్లు 2 చిత్రానికి సంబంధించి పోస్టర్స్ , టీజర్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. తాజాగా రిలీజ్ చేసిన ట్యాక్సీలో జొన్నల గడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ కలిసి ముద్దు పెట్టుకునే సీన్ హల్ చల్ చేస్తోంది. మొత్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే టిల్లు చిత్రం దుమ్ము రేపింది. భారీ ఎత్తున కలెక్షన్లు కొల్లగొట్టింది. తాజాగా విడుదలయ్యే ఈ మూవీ కూడా అంతకు మించి ఆదరణ చూరగొంటుందనే నమ్మకం నెలకొంది.