NEWSNATIONAL

జీతే ర‌హో భ‌గ‌వంత్ మాన్

Share it with your family & friends

పంజాబ్ సీఎంగా స‌క్సెస్

హైద‌రాబాద్ – పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న తొలుత న‌టుడిగా ప్రారంభించారు. ఆ త‌ర్వాత అనుకోకుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ సిద్దూ న్యాయ నిర్ణేత‌గా ఉన్న స‌మ‌యంలో త‌ను పాల్గొన్నాడు. కానీ త‌న హ‌యాంలో పంజాబ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సిద్దూను ఓడి పోయేలా చేశాడు. అంద‌రూ రాజ్ భ‌వ‌న్ లో ప్ర‌మాణ స్వీకారం చేస్తే..త‌ను ప్రాణ ప్రదంగా ఆరాధించే, కొలిచే , దైవంగా న‌మ్మే ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ స్మార‌క స్థ‌లం వేదిక‌గా ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

త‌న ఆలోచ‌న‌ల‌కు స‌రైన వేదిక ఆమ్ ఆద్మీ పార్టీనేన‌ని భావించాడు. రెండు సార్లు పంజాబ్ లోని సింగూరు నుంచి ఎంపీగా గెలుపొందాడు. అనూహ్యంగా ఏకంగా సీఎం ప‌ద‌విలో కొలువు తీరాడు. త‌ను ఇచ్చిన మాట ప్ర‌కారం హామీల‌ను నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డాడు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ నంతా ప‌ర్మినెంట్ చేశాడు. త‌ను మాట‌ల మనిషిని కాద‌ని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించే సీఎంన‌ని త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

1972 అక్టోబ‌ర్ 17న స‌గ్రూర్ జిల్లా స‌తోజ్ ప‌ల్లెలో పుట్టాడు. తండ్రి మోహింద‌ర్ సింగ్ . త‌ను టీచ‌ర్. బీకాం చ‌దివాడు. భ‌గ‌వంత్ మాన్ 1992లో క్రియేటివ్ మ్యూజిక్ కంపెనీలో చేరాడు. షోలు చేయ‌డం ప్రారంభించాడు. 1994లో క‌చారి సినిమాలో న‌టించాడు. 2018 దాకా 12కి పైగా సినిమాల్లో న‌టించాడు.

కామెడీ ఆల్బ‌మ్ జ‌గ్తార్ జగ్గీ, 2006 లో భ‌గ‌వంత్ మాన్ , జ‌గ్గీ వారి నో లైఫ్ విత్ వైఫ్ షోఉ, 2008లో గ్రేట్ ఇండియాన్ లాఫ్ట‌ర్ ఛాలెంజ్ వంటి కార్య‌క్ర‌మాలో పాపుల‌ర్ అయ్యాడు. అంతే కాదు మెయిన్ మా పంజాబ్ ది అనే సినిమాకు గాను భ‌గ‌వంత్ మాన్ జాతీయ పుర‌స్కారం అందుకున్నాడు.

ప్ర‌జ‌ల‌ను ప్రేమించే భ‌గ‌వంత్ మాన్ ప్ర‌జా సేవ‌కు పున‌రింకితం కావాల‌ని కోరుకుందాం.