NEWSNATIONAL

పౌర‌స‌త్వ చ‌ట్టం 6ఏపై కీల‌క తీర్పు

Share it with your family & friends

చెల్లుబాటు అవుతుంద‌న్న సుప్రీంకోర్టు

ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. పౌర‌స‌త్వ చ‌ట్టంలోని సెక్ష‌న్ 6ఎపై దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం సెక్ష‌న్ 6ఏ చెల్లుబాటు అవుతుంద‌ని తీర్పు చెప్పింది.

మొత్తం ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం దీనిని విచారించింది. న‌లుగురు న్యాయ‌మూర్తులు మ‌ద్ద‌తు ప‌లుక‌గా ఒక న్యాయ‌మూర్తి వ్య‌తిరేకంగా తీర్పు వ్య‌తిరేకించారు. ఈ సంద‌ర్బంగా విదేశీయులు పౌర‌స‌త్వం పొందినా 10 ఏళ్ల దాకా వారిని ఓట‌రు జాబితాలో చేర్చ‌డం కుద‌రద‌ని పేర్కొన్నారు జ‌స్టిస్ పార్థీవాలా. అయితే గ‌తంలో రాజీవ్ గాంధీ స‌ర్కార్ పౌర‌స‌త్వ చ‌ట్టంలో సెక్ష‌న్ 6ఏను చేర్చింది.

ఇదిలా ఉండ‌గా 1971కి ముందు అస్సాం లోని వ‌ల‌స‌దారుల పౌర‌స‌త్వంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని సూర్య‌కాంత్ , ఎంఎం సుంద‌రేష్, మ‌నోజ్ మిశ్రాల‌తో పాటు పార్థివాలా ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. పార్థివాలా ఒక్క‌రే విభేదించారు.

అయితే జ‌న‌వ‌రి 1, 1996 , మార్చి 25, 1971 మ‌ధ్య బంగ్లాదేశ్ నుండి వ‌చ్చిన వ‌ల‌స‌దారులు పౌర‌స‌త్వానికి అర్హులు అని బెంచ్ పేర్కొంది.