NEWSINTERNATIONAL

మాజీ పీఎం షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్

Share it with your family & friends

జారీ చేసిన బంగ్లాదేశ్ అత్యున్న‌త కోర్టు

బంగ్లాదేశ్ – భార‌త దేశంలో త‌ల‌దాచుకున్న బంగ్లాదేశ్ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆ దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు గురువారం మాజీ పీఎం షేక్ హ‌సీనాను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌జాస్వామ్య యుతంగా ఆమె పీఎంగా ఎన్నిక‌య్యారు. అయితే దేశంలో చోటు చేసుకున్న అంత‌ర్యుద్దం కార‌ణంగా ప‌ద‌వీచ్యుతురాల‌య్యారు. ఈ ఏడాది ఆగ‌స్టులో త‌న 15 ఏళ్ల ప్ర‌భుత్వాన్ని విద్యార్థుల నేతృత్వంలో చోటు చేసుకున్న ఆందోళ‌న‌లు, పోరాటాల కార‌ణంగా త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది.

దీంతో ముందుగా లండ‌న్ కు వెళ్లాల‌ని అనుకుంది. కానీ ఆ దేశం షేక్ హ‌సీనా వ‌చ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో త‌నకు న‌మ్మ‌క‌మైన స్నేహితుడిగా ఉన్న భార‌త దేశం వైపు ప్ర‌యాణం చేసింది. చివ‌ర‌కు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య షేక్ హ‌సీనా ఇండియాలో కాలు మోపింది. ప్ర‌స్తుతం ఆమె భార‌త్ లో త‌ల‌దాచుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆదేశాలు జారీ చేసిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్టు చేసి నవంబర్ 18న కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. జూలై నుండి ఆగస్టు మధ్య కాలంలో మానవాళికి వ్యతిరేకంగా మారణకాండలు, హత్యలు, నేరాలకు పాల్పడిన వారికి షేక్ హసీనా నాయకత్వం వహించారు అంటూ ఆరోపించింది.

బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.