దక్షిణాది సినీ పరిశ్రమ సపోర్ట్ భేష్
ప్రముఖ బహు భాషా నటి సమంత
హైదరాబాద్ – తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర గందరగోళానికి, రచ్చకు దారి తీశాయి. గత ప్రభుత్వ హయంలో అక్కినేని నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ మాల్ ను కూల్చకుండా ఉండేందుకు తన మాజీ కోడలు అయిన నటి సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని బలవంతం చేశాడంటూ ఆరోపించింది.
దీనిపై సినీ పరిశ్రమ మొత్తం తీవ్రంగా ఖండించింది. చివరకు ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకునేంత దాకా వెళ్లింది. ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి. ఏకంగా నాగార్జున ఫ్యామిలీ రూ. 100 కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. ఇటీవలే నాంపల్లి కోర్టుకు తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించారు. ఈ సందర్బంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సమంత ఇవాళ తమిళ సినీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమ ఇచ్చిన మద్దతు మరిచి పోలేనని అన్నారు.
ఇండస్ట్రీతో పాటు అభిమానులు చూపించిన ఆదరాభిమానాలే తనను వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందన్నారు సమంత.