గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై సీఎస్ సమీక్ష
జిల్లా కలెక్టర్లు..ఎస్పీలతో సమావేశం
హైదరాబాద్ – గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. గురువారం సచివాలయంలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్ ,ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రయోజనం చేకూర్చేలా పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ వాపోయారు బాధితులు.
ఇదే సమయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం అయ్యారు. మరో వైపు కోర్టు మెయిన్స్ పరీక్షకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పలు కేసులు నమోదయ్యాయి కోర్టులో దీనికి సంబంధించి.