సీఎం నయాబ్ సైనీకీ కంగ్రాట్స్ – మోడీ
ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది
హర్యానా – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానా నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో ఆరుగురు మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మనపై మరోసారి నమ్మకాన్ని ఉంచారని, అందుకే భారీ మెజారిటీని కట్టబెట్టారని అన్నారు.
వారి ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగించాలని పిలుపునిచ్చారు. మనపై ఉంచిన నమ్మకాన్ని పెంచుకునేలా పనితీరు కనబర్చాలని సూచించారు. ఈ విజయం రాబోయే రెండు రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్ లలో కూడా ప్రతిఫలించాలని , ఆ నమ్మకం తనకు ఉందని చెప్పారు.
గురువారం హర్యానాలో జరిగిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. వారిని ఉద్దేశించి పీఎం ప్రసంగించారు.
ముచ్చటగా హర్యానాలో బీజేపీకి మూడోసారి పట్టం కట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మోడీ.