జమిలి ఎన్నికలకు సిద్దం కావాలి – జగన్
పార్టీ నేతలు..కార్యకర్తలకు హితబోధ
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తొలిసారిగా జమిలి ఎన్నికలపై స్పందించారు. గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడారు.
ఇంట్లో కూర్చోవాలని అనుకుంటే కుదరదని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేక పోతోందన్నారు. పాలనా పరంగా అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఇదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోందని, మనందరం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చొరవ తీసుకుని ఆయా అంశాలపై స్పందించాలని స్పష్టం చేశారు మాజీ సీఎం.
పార్టీ పరంగా సంస్థాగతంగా బలంగా ఉంటే దేనినైనా ఎదుర్కొన గలమని , ఆ బలం కలిసి ఉండడం వల్ల వస్తుందని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.