NEWSTELANGANA

మోదీకి మెగాస్టార్ థ్యాంక్స్

Share it with your family & friends

ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టుడు , మెగా స్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా 132 ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశంలో అత్యున్న‌త‌మైన భార‌త ర‌త్న త‌ర్వాత రెండో పౌర పుర‌స్కారంగా ప‌ద్మ విభూష‌ణ్ ను భావిస్తారు. కేవ‌లం ఐదుగురికి ప్ర‌క‌టించింది.

ఇక బీహార్ కు చెందిన మాజీ సీఎం , జ‌న నాయ‌కుడిగా పేరు పొందిన క‌ర్పూరి ఠాకూర్ కు భార‌త ర‌త్న ప్ర‌క‌టించింది మోదీ ప్ర‌భుత్వం. ఈ నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకం వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న బ‌హుజ‌నుల కోసం ప‌ని చేశారు. ప్ర‌జా పాల‌న అంటే ఏమిటో చూపించారు ఠాకూర్.

ఇక ప‌ద్మ విభూష‌ణ్ విష‌యానికి వ‌స్తే మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడుతో పాటు ఏపీకి చెందిన మొగల్తూరుకు చెందిన ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవికి కూడా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా మెగాస్టార్ స్పందించారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న స్పంద‌న తెలిపారు.

త‌న‌కు అత్యున్న‌త పుర‌స్కారం ప్ర‌క‌టించినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ క్ష‌ణం మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నారు.