NEWSTELANGANA

సాంకేతిక విప్ల‌వానికి రాజీవ్ గాంధీ ఆద్యుడు

Share it with your family & friends

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మూసీ సుందరీక‌ర‌ణ‌కు సంబంధించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందన్నారు రేవంత్ రెడ్డి.. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించామ‌ని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నామ‌ని అన్నారు సీఎం.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైందని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణమ‌ని అన్నారు.

కంప్యూటర్‌తో ఉద్యోగాల క‌ల్ప‌న పెరిగింద‌ని, ఇదే స‌మ‌యంలో కూడా ఆయా రంగాల‌లో ఆదాయం కూడా పెరిగింద‌ని చెప్పారు సీఎం. కాంగ్రెస్ విజన్‌తోనే దేశం ముందడుగు వేసిందని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

అప్పటి ప్రధాని పీవీ న‌ర‌సింహారావు సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, ఆ విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచిందని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.