NEWSANDHRA PRADESH

అబ‌ద్దాలు ఆడ‌ను హామీలు ఇవ్వ‌లేను

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావతి – వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను అబ‌ద్దాలు ఆడ‌న‌ని , ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌లేన‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌తిప‌క్షంలో కూర్చొనేందుకు తాను సిద్దంగా ఉంటాన‌ని జ‌నాన్ని మోసం చేయ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం కొలువు తీరి నాలుగు నెల‌లైనా కాలేద‌ని కానీ అంత‌లోనే ప్ర‌జల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంద‌ని అన్నారు.

తాను మాట్లాడిన మాట‌లు ఎవ‌రికీ న‌చ్చ‌క పోవ‌చ్చ‌ని కానీ ఇది వాస్త‌వ‌మ‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తాను మాట ఇవ్వ‌న‌ని, కానీ ఇస్తే మాత్రం త‌ప్ప‌న‌ని అన్నారు. ఎవ‌రికీ న‌చ్చినా న‌చ్చ‌క పోయినా తాను మాత్రం న‌మ్మిందే చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలనే ఈ మాట చెప్తున్నానని , ప్ర‌తి ఒక్క‌రు అర్థం చేసుకుని పార్టీ ప‌టిష్ట‌త కోసం కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు . త్వ‌ర‌లోనే జ‌మిలి ఎన్నిక‌లు రాబోతున్నాయ‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి పార్టీ బ‌లోపేతం చేసేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కూట‌మి స‌ర్కార్ ప్ర‌జల పాలిట శాపంగా త‌యారైంద‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని స్పష్టం చేశారు మాజీ సీఎం. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాపై దృష్టి సారించాల‌ని పేర్కొన్నారు .