NEWSTELANGANA

మూసీ ఇళ్ల వ‌ద్ద ఉంటే కిరాయి చెల్లిస్తా – సీఎం

Share it with your family & friends

కేటీఆర్..హ‌రీష్‌..ఈట‌ల‌కు రేవంత్ స‌వాల్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ల‌పై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే త‌న స‌వాల్ ను స్వీక‌రించాల‌ని పిలుపునిచ్చారు.

మీకు ద‌మ్ముంటే మూసీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇళ్ల‌ వ‌ద్ద మూడు నెల‌ల పాటు ఉండాల‌ని, త‌న స్వంత ఆస్తిలో నుంచి కిరాయి చెల్లిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అక్కడ ఉంటే మూసీ ప్రాజెక్టును వెంటనే ఆపేస్తానని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్బంగా మూసీ న‌ది పుట్టు పూర్వోత్త‌రాల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎ. రేవంత్ రెడ్డి. అనంతగిరి రామ లింగేశ్వరుడి దగ్గర నుండి మొదలైన ఈ నదులు..ఈశ్వరుడి పాదాల నుండి పుట్టింద‌ని చెప్పారు . మూసీ.. వాస్తవంగా మూసా.. అంటే మోజేస్… ఇంకో నది ఈసా… అంటే ఏసు అని పేర్కొన్నారు ఎ. రేవంత్ రెడ్డి.

మూసా మొజెస్ ఏసు… అలా ప్రవహిస్తూ పాతబస్తీ మీదుగా పయనిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని స్ప‌ష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఇదిలా ఉండ‌గా అర్థం ప‌ర్థం లేకుండా , చ‌రిత్ర తెలుసు కోకుండా ఎలా మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్, దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్, జ‌గ‌దీశ్ రెడ్డి.