రాజధాని నిర్మాణం వరల్డ్ బ్యాంక్ సహకారం
రూ. 15,000 కోట్లు డిసెంబర్ లోపు రాక
అమరావతి – ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే తాము అమరావతిని ప్రపంచంలోనే అద్బుతమైన రాజధాని నగరంగా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. పొంగూరు నారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజధాని విషయంలో.
ప్రస్తుతం తమ నాయకుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విస్తృతంగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు పొంగూరు నారాయణ. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కావడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా బ్యాంకు ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని గట్టి హామీ ఇచ్చారని చెప్పారు.
ఇందులో భాగంగా చాలా అంశాలపై చర్చలు జరిపామని , అటు వైపు నుంచి సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు పొంగూరు నారాయణ. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి..
రాజధాని నిర్మాణానికై వరల్డ్ బ్యాంక్ నుండి 15వేల కోట్ల నిధులు ఈ డిసెంబర్ లోపు విడుదల కానున్నాయని తెలియజేయడం జరిగింది.