సద్గురు ఇషా ఫౌండేషన్ పై ఆరు కేసులు
సుప్రీంకోర్టుకు తెలిపిన పోలీసులు
ఢిల్లీ – సద్గురు జగ్గీ వాసుదేవన్ కు చెందిన ఇషా ఫౌండేషన్ కు బిగ్ షాక్ తగిలింది. ఇషా యోగా కేంద్రానికి సంబంధించిన కేసుల గురించి తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టుకు కీలక సమాచారం అందజేశారు. అఫిడవిట్ లో గత 15 ఏళ్లలో ఇషా ఫౌండేషన్‌ని కలిగి ఉన్న ఆలందురై పోలీస్ స్టేషన్ 6 మిస్సింగ్ కేసులను నమోదు చేసిందని వెల్లడించారు. ఇందులో 5 కేసులను తొలగించడం జరిగిందని పేర్కొన్నారు కోర్టుకు.
ప్రస్తుతం ఇషా ఫౌండేషన్ కు సంబంధించి 6వ కేసు పెండింగ్ లో ఉందని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. తప్పి పోయిన వ్యక్తి గురించి సమాచారం ఇంకా లభించ లేదని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈశా యోగా కేంద్రానికి సంబంధించి కొందరు మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదులు, ఆత్మహత్యలపై విచారణలు జరుగుతున్నాయని తెలిపారు.
174 క్రైమ్ పీసీ కింద మొత్తం 7 కేసులు నమోదు చేశామన్నారు. వాటిలో 2 కేసులు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం పంపించామని, ఇంకా నివేదికలు రాలేదని కోర్టుకు విన్నవించారు తమిళనాడు పోలీసులు. ఇదిలా ఉండగా అక్టోబరు 1 నాటికి 217 మంది బ్రహ్మచారిలు, 2455 మంది వాలంటీర్లు, 891 మంది వేతనంతో కూడిన సిబ్బంది, 147 మంది వేతన కార్మికులు, 342 మంది ఈశా హోమ్ స్కూల్ విద్యార్థులు, 175 మంది ఈశా సంస్కృతి విద్యార్థులు, విదేశాల నుంచి 704 మంది సందర్శకులు, 912 మంది అతిథులు ఉన్నారని ఏవోఆర్ డీ కుమనన్ ద్వారా దాఖలు చేసిన నివేదిక పేర్కొంది.