రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
సెక్యూరిటీ లేకుండా వస్తానన్నావు కదా
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణపై సీఎం చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు.
సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా అని సవాల్ విసిరారు. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం అని ప్రకటించారు తన్నీరు హరీశ్ రావు.
ముందు మూసి నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదామని అన్నారు.
సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని, ఆ విషయం తెలుసు కోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు.