DEVOTIONAL

ఉన్మాదాన్ని ఏ మ‌తం స‌హించ‌దు – ఈట‌ల

Share it with your family & friends

వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి

సికింద్రాబాద్ – మ‌ల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సికింద్రాబాద్ లోని కుమ్మ‌ర‌గూడ ముత్యాల‌మ్మ అమ్మ వారి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఉన్మాదాన్ని ఏ మ‌తం స‌హించ‌ద‌న్నారు. ..

రక్షపురంలో భూలక్ష్మి అమ్మ వారు, ఉప్పుగూడ దేవాలయం, మైలార్దేవ్ పల్లి ఆలయం, ఎగ్జిబిషన్ లో అమ్మవారి ఆలయం ఇప్పుడు సికింద్రాబాద్ కుమ్మర గూడ అమ్మవారి దేవాలయం మీద దాడి జ‌రిగింద‌న్నారు.

అమ్మవారి గుండెల మీద తన్నడ‌మంటే, మన విశ్వాసం మీద, ధర్మం మీద దాడి చేయడం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు.

ఇవే కాదు సంగారెడ్డి జిల్లా ఆంజనేయ స్వామి దేవాలయం, వినాయక విగ్రహం మీద దాడి..ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

ఈ అమ్మ వారి మీద దాడి చేసిన వాడు.. హాస్పిటల్ బెడ్ మీద దర్జాగా పడుకొని చాటింగ్ చేస్తున్నాడని,
ఇంకా అవమానకర పోస్టులు పెడుతున్నాడని, అల్లానే ఈ పని చేయించాడు అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

వాడి దగ్గర సెల్ ఫోన్ ఎలా ఉంది? వాడు మనిషా ? ఉన్మాదా అని నిల‌దీశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించు కోకపోతే కేంద్రం, మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంద‌ని హెచ్చ‌రించారు.

ఏ మతం కూడా ఇలాంటి చర్య సమర్థించదన్నారు.. హిందూ మతం సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకుంటుందని స్ప‌ష్టం చేశారు. అమెరికా, లండన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఇండియన్స్ అంటే గొప్ప మర్యాద ఉంటుందన్నారు.

మనవారు ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు కొనసాగిస్తున్నారని, ఏ దేశంలో మహిళలు గౌరవించ బడతారో ఆ దేశం చల్లగా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం భార‌త దేశం అని పేర్కొన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

ఎవరి విశ్వాసాలకు తగ్గట్టు వారు ఉండాలి. కానీ కొద్దిమంది ఇలాంటి వారు మీటింగ్ పెట్టుకుంటే ఇంటిలిజెన్స్ పోలీస్ ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. రేవంత్ మీ దిక్కు మాలిన ఓట్ల రాజకీయం పక్కన పెట్టండి అంటూ మండిప‌డ్డార‌ను.

ప్రజల ప్రాణాలు, విశ్వాసం, ధర్మం కాపాడలేని వారు నాయకులు కాదు అనేది బీజేపీ సిద్ధాంతమ‌న్నారు
ఇలాంటి వారి మీద నిఘా పెట్టీ నిలవరించాల‌ని, పాకిస్థాన్ లో ట్రైనింగ్ పొంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.